నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. ఓ యువతి.. | Sakshi
Sakshi News home page

నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. 

Published Fri, Mar 9 2018 7:16 AM

Police Filed  cases in Drunk And Drive in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కొరడా ఝులిపించారు. తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. వివరాలివి..  జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో పోలీసులు గురువారం రాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో మొత్తం 8కార్లు, 8 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ యువతి కూడా మద్యం తాగి కారు నడుపుతూ దొరికిపోయింది.

దీనిపై పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. రాత్రి 10 గంటల నుంచి 01.00 గంట వరకు నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించామన్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 16మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో 8 కార్లు, 8 బైక్‌లు ఉన్నట్లు పోలీస్‌ అధికారి చెప్పారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement